Samantha: నువ్వు ఉక్కు మహిళవి.. విజయం నీ జన్మహక్కు: సమంతకు ఫొటో పంపిన రాహుల్ రవీంద్రన్

Actor Rahul Ravindran Gifted Photo Frame to Actress Samantha
  • సమంతను యోధురాలిగా అభివర్ణించిన రాహుల్ రవీంద్రన్
  • త్వరలోనే నీ దారి ప్రకాశిస్తుందన్న నటుడు
  • రాహుల్ పంపిన ఫొటోను షేర్ చేసిన సమంత
  • కఠినమైన పోరాటాలు చేస్తున్న వారికి ఇది అంకితమన్న సమంత
మయోసైటిస్‌తో బాధపడుతున్న టాలీవుడ్ ప్రముఖ నటి సమంతకు నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఓ శక్తిమంతమైన సందేశంతో ఉన్న ఫొటోను బహుమతిగా అందించారు. ప్రస్తుతం నీ దారి చీకటిగా ఉండొచ్చు కానీ, త్వరలోనే అది ప్రకాశిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం నీ శరీరంలో కదలికలు కష్టంగా ఉండొచ్చని, కానీ త్వరలోనే అన్నీ బాగుంటాయని అన్నారు. నువ్వు ఉక్కు మహిళవని, విజయం నీ జన్మహక్కని అందులో పేర్కొన్నారు. నువ్వొక యోధురాలివని, నిన్ను ఏదీ ఓడించలేదన్నారు. ఇలాంటివి నిన్ను ఇంకా బలపడేలా చేస్తాయని, ఎప్పటికీ బలంగా ఉండేలా చేస్తాయని ఆ ఫొటోలో రాసి ఉంది.     

రాహుల్ నుంచి అందుకున్న ఫొటోను సమంత ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. కఠినమైన పోరాటాలు చేస్తున్న వారికి ఇది అంకితమని, పోరాడుతూనే ఉంటే గతంలో కంటే బలంగా తయారవుతారని రాసుకొచ్చింది. కాగా, సమంత నటించిన యశోద సినిమా ఇటీవల విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే పూర్తయిన ఈ సినిమాకు నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. అలాగే, విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ సినిమాలో నటిస్తోంది.
Samantha
Tollywood
Rahul Ravindran

More Telugu News