గాలి జనార్దన్ రెడ్డి బీజేపీని వీడటానికి కారణం ఇదే!
- కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరుతో పార్టీని ప్రకటించిన జనార్దన్ రెడ్డి
- వచ్చే ఎన్నికల్లో గంగావతి నుంచి పోటీ
- తన భార్యతో కలిసి గంగావతిలో పర్యటిస్తున్న గాలి
ఇటీవలే గంగావతిలోని ఓ అభివృద్ధి కార్యక్రమానికి రూ. 6 కోట్ల విరాళం ఇవ్వనున్నట్టు జనార్దన్ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటన బీజేపీ శ్రేణుల్లో అసంతృప్తికి కారణమయిందని తెలుస్తోంది. దీంతో ఆయన బీజేపీ నాయకత్వానికి దూరంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన కొత్త పార్టీని ప్రకటించారు. మరోవైపు అక్రమ గనుల తవ్వకాల కుంభకోణంలో జనార్దన్ రెడ్డి నాలుగేళ్లు జైల్లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన సుప్రీంకోర్టు ఇచ్చిన కండిషనల్ బెయిల్ పై బయట ఉన్నారు.