PAN: పాన్-ఆధార్ అనుసంధానానికి మరో మూడు నెలలే

  • ప్రతి ఒక్కరూ మార్చి 31లోపు లింక్ చేసుకోవాలి
  • లేదంటే పాన్ పని చేయదన్న ఆదాయపన్ను శాఖ
  • పాన్ పని చేయకపోతే రిటర్నులు వేయడం, రిఫండ్ కోరడం కుదరదు
PAN Not Linked With Aadhaar By March 31 2023 To Be Rendered Inoperative

పాన్ ఉన్న ప్రతి ఒక్కరూ దాన్ని తమ ఆధార్ తో అనుసంధానం చేసుకోవాలి. మార్చి 31లోపు ఈ పని చేయకపోతే ఆధార్ బ్లాక్ అవుతుందని ఆదాయపన్ను శాఖ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. తప్పనిసరిగా లింక్ చేసుకోవాలని, దీన్ని ఆలస్యం చేయకుండా ఈ రోజే ఆ పనిచేయాలని సూచించింది. ‘‘ఆదాయపన్ను చట్టం 1961 ప్రకారం పాన్ కలిగిన ప్రతి ఒక్కరూ (మినహాయింపు విభాగం కిందకు రాని వారు) 2023 మార్చి 31 లోపు తమ పాన్ ను ఆధార్ తో అనుసంధానం చేసుకోవాలి. 2023 ఏప్రిల్ 1 నుంచి లింక్ చేసుకోని పాన్ నంబర్లు పనిచేయకుండా పోతాయి’’అని తెలిపింది.

మినహాయింపు విభాగంలోని వారు అంటే.. అసోం, జమ్మూ అండ్ కశ్మీర్, మేఘాలయ, ఎన్ఆర్ఐలు, 80 ఏళ్లు నిండిన పెద్దలు అని అర్థం చేసుకోవాలి. మిగిలిన అందరూ తమ పాన్ ను ఆధార్ తో అనుసంధానించుకోవాల్సిందే. పాన్ పని చేయకుండా పోతే, తదుపరి ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయడం, రిఫండ్ లు కోరడం సాధ్యపడదు. పెట్టుబడులకు ఇబ్బంది ఏర్పడుతుంది. బ్యాంకు లావాదేవీలకు సైతం సమస్యలు ఎదురవుతాయి. కనుక వెంటనే లింక్ చేసుకోవడమే ఉత్తమం.

More Telugu News