nayanatara: నయనతారపై ట్రోలింగ్.. మండిపడ్డ చిన్మయి

Chinmayi response on trolling on Nayantara
  • నయన్ శరీరాకృతిపై సోషల్ మీడియాలో విమర్శలు
  • ఆగ్రహం వ్యక్తం చేసిన సింగర్ చిన్మయి
  • ఇలాంటి వారిని దూరం పెట్టాలని వ్యాఖ్య
దక్షిణాది స్టార్ హీరోయిన్ నయనతార, ఆమె భర్త విగ్నేశ్ శివన్ లు ఇటీవలే తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. నయన్ తల్లి అయిన తర్వాత ఆమె శరీరంలో కొన్ని మార్పులు వచ్చాయి. ఆమె శరీరాకృతి గురించి కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. నయన్, విఘ్నేశ్ ఇద్దరూ తల్లిదండ్రులైన తర్వాత తొలిసారి ఒక పబ్లిక్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా వారి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే కొందరు నెటిజెన్లు వీరిపై అసభ్యకరమైన కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సింగర్ చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి కామెంట్లు చేసేవాళ్లను దూరం పెట్టాలని ఆమె అన్నారు. వారి వల్ల ఎలాంటి ఉపయోగం తేదని విమర్శించారు.
nayanatara
Chinmayi
Tollywood

More Telugu News