Raghu Rama Krishna Raju: అత్యాచారాలు, అప్పుల్లో రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా నిలిపిన ఘనుడు జగన్: రఘురామకృష్ణరాజు

Jagan took AP to 50 years back says Raghu Rama Krishna Raju
  • జగన్ పాలనలో రాష్ట్రం 50 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్న రఘురాజు
  • జీతాలు ఇవ్వలేని పరిస్థితిని బొత్స సమర్థించుకోవడం సిగ్గుచేటని విమర్శ
  • ఉత్తరాంధ్రలో టీడీపీ ప్రభంజనం కొనసాగుతోందని వ్యాఖ్య
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యాచారాలు, రైతుల ఆత్మహత్యలు, గంజాయి, అప్పుల్లో రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్ గా నిలిపిన ఘనుడు జగన్ అని విమర్శించారు. జగన్ పాలనలో రాష్ట్రం 50 ఏళ్లు వెనక్కి వెళ్లిందని అన్నారు. 

ప్రభుత్వ ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు ఎందుకు చెల్లించడం లేదని కోర్టు అడిగితే... తన తండ్రి కూడా ఉపాధ్యాయుడేనని, తన చిన్నతనంలో ఆయనకు కూడా మూడు నెలలు జీతాలు రాలేదని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి చెప్పారని... ఆయన చిన్నతనం అంటే 50 ఏళ్ల కిందటే కదా అని అన్నారు. జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న రాష్ట్రం 50 ఏళ్ల వెనక్కి వెళ్లినట్టే కదా అని ఎద్దేవా చేశారు. జీతాలు ఇవ్వలేని దారుణ పరిస్థితిని కూడా మంత్రి బొత్స సమర్థించుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో టీడీపీ ప్రభంజనం కొనసాగుతోందని... చంద్రబాబు రోడ్ షోకు జనాలు పోటెత్తారని చెప్పారు.
Raghu Rama Krishna Raju
YSRCP
Jagan
Botsa Satyanarayana
Chandrababu
Telugudesam

More Telugu News