Telangana: లాటరీలో రూ. 30 కోట్లు గెలుచుకున్న దుబాయ్ లోని తెలంగాణ యువకుడు

Telangana driver wins Rs 30 Cr in lottery in Dubai
  • దుబాయ్ లో డ్రైవర్ గా పని చేస్తున్న అజయ్
  • 30 దిర్హాములతో రెండు లాటరీ టికెట్లు కొన్న వైనం
  • నాలుగేళ్ల క్రితం దుబాయ్ వెళ్లిన అజయ్
కొంతమందిని అదృష్టలక్ష్మి వెతుక్కుంటూ వస్తుంటుంది. అలాంటి వారి జీవితాలు రాత్రికి రాత్రే మారిపోతుంటాయి. లక్ష్మీదేవి కరుణించడంతో తెలంగాణలోని జగిత్యాల జిల్లా బీర్ పూర్ మండలం తుంగూరు గ్రామానికి చెందిన ఓగుల అజయ్ అనే డ్రైవర్ కోటీశ్వరుడయ్యాడు. దుబాయ్ లో ఉంటున్న అజయ్ కొన్న లాటరీకి ఏకంగా రూ. 30 కోట్ల జాక్ పాట్ తగిలింది. 

అజయ్ ది నిరుపేద కుటుంబం. ఆయన తండ్రి కూడా మరణించడంతో తల్లే పెంచింది. నాలుగేళ్ల క్రితం ఉపాధికోసం ఈ యువకుడు దుబాయ్ కి వెళ్లాడు. అక్కడ ఒక జ్యువెలరీ షాప్ లో డ్రైవర్ గా పనికి కుదిరాడు. ఈ క్రమంలో 30 దిర్హాములతో రెండు ఎమిరేట్స్ లక్కీ లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు. ఇందులో ఒక టికెట్ కు రూ. 30 కోట్ల జాక్ పాట్ తగిలింది. తనకు లాటరీ తగలడంతో అజయ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
Telangana
Driver
Dubai
Lottery

More Telugu News