Vidadala Rajini: రాష్ట్రానికి అత్యవసరంగా వ్యాక్సిన్లు పంపాలని కేంద్రాన్ని కోరిన ఏపీ మంత్రి విడదల రజని

  • చైనాలో బీఎఫ్-7 వేరియంట్ విజృంభణ
  • భారత్ లోనూ పలు కేసులు
  • అప్రమత్తమైన కేంద్రం
  • వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మన్సుఖ్ మాండవీయ
AP health minister Vidadala Rajini urges Center to allocate vaccines

దేశంలో కరోనా పరిస్థితులు, నియంత్రణపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని కూడా విశాఖ నుంచి వర్చువల్ గా పాల్గొన్నారు.  

ప్రస్తుతానికి రాష్ట్రంలో 47 వేల వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రెండు, మూడు రోజుల్లో వ్యాక్సిన్ నిల్వలు అయిపోతాయని అన్నారు. రాష్ట్రానికి అత్యవసరంగా వ్యాక్సిన్లు పంపాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కరోనా కట్టడిపై ఏపీ ప్రభుత్వం అవగాహన కార్యక్రమం చేపట్టిందని విడదల రజని వెల్లడించారు. 

చైనాను వణికిస్తున్న బీఎఫ్-7 ఒమిక్రాన్ సబ్ వేరియంట్ భారత్ లోనూ వెలుగుచూడడంతో కేంద్రం అప్రమత్తమైంది. ప్రధాని నరేంద్ర మోదీ నిన్న అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించి దేశంలో పరిస్థితులను సమీక్షించారు.

More Telugu News