Nicholas Pooran: ఐపీఎల్ వేలంలో రూ.16 కోట్లు కొల్లగొట్టిన వెస్టిండీస్ మాజీ కెప్టెన్

West Indies former skipper Nicholas Pooran gains Rs 16 crores in IPL auction
  • గత సీజన్ లో హైదరాబాద్ తరఫున ఆడిన పూరన్
  • ఆశించిన స్థాయిలో రాణించని వైనం
  • జట్టు నుంచి విడుదల చేసిన సన్ రైజర్స్
  • ఈసారి వేలంలో అదిరిపోయే ధర
కొచ్చిలో జరుగుతున్నది ఐపీఎల్ మినీ వేలం అయినా రికార్డుల మోత మోగుతోంది. తాజాగా, వెస్టిండీస్ మాజీ సారథి నికోలాస్ పూరన్ కు వేలంలో రూ.16 కోట్ల ధర పలికింది. విధ్వంసక బ్యాటింగ్ తో చెలరేగే పూరన్ ను లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. ఈ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కనీస ధర రూ.2 కోట్లు కాగా, నేటి వేలంలో అంతకు 8 రెట్లు ధర పలకడం విశేషం. ఐపీఎల్ గత సీజన్ లో పూరన్ సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహించాడు. అప్పటి వేలంలో సన్ రైజర్స్ పూరన్ ను రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో సన్ రైజర్స్ అతడిని జట్టు నుంచి విడుదల చేసింది. 

ఇక ఇవాళ్టి వేలంలో అమ్ముడైన ఆటగాళ్ల వివరాలు...

శివమ్ మావి- రూ.6 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
ముఖేశ్ కుమార్- రూ.5.5 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
హెన్రిచ్ క్లాసెన్- రూ.5.25 కోట్లు (సన్ రైజర్స్ హైదరాబాద్)
విల్ జాక్స్- రూ.3.2 కోట్లు (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు)

మనీష్ పాండే- రూ.2.4 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
అదిల్ రషీద్- రూ.2 కోట్లు (సన్ రైజర్స్ హైదరాబాద్)
ఫిల్ సాల్ట్- రూ.2 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
రీస్ టాప్లే- రూ.1.9 కోట్లు (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు)
జే రిచర్డ్సన్- రూ.1.5 కోట్లు (ముంబయి ఇండియన్స్)
శ్రీకర్ భరత్- రూ.120 కోట్లు (గుజరాత్ టైటాన్స్)

డేనియల్ సామ్స్- రూ.75 లక్షలు (లక్నో సూపర్ జెయింట్స్)
వైభవ్ అరోరా- రూ.60 లక్షలు (కోల్ కతా నైట్ రైడర్స్)
జయదేవ్ ఉనద్కట్- రూ.50 లక్షలు (లక్నో సూపర్ జెయింట్స్)
ఇషాంత్ శర్మ- రూ.50 లక్షలు (ఢిల్లీ క్యాపిటల్స్)
రొమారియో షెపర్డ్- రూ.50 లక్షలు (లక్నో సూపర్ జెయింట్స్)

ఉపేంద్ర యాదవ్- రూ.25 లక్షలు (సన్ రైజర్స్ హైదరాబాద్)
హిమాంశు శర్మ- రూ.20 లక్షలు (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు)
Nicholas Pooran
LSG
Auction
IPL
West Indies

More Telugu News