Pawan Kalyan: ఖైరతాబాద్ ఆర్టీయే కార్యాలయంలో పవన్ కల్యాణ్... 6 కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్

Pawan Kalyan at Khairatabad RTA office
  • ఆర్టీఏ కార్యాలయంలో పవన్ సందడి
  • కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన పవన్
  • ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ కూడా పొందిన వైనం

టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిన్న హైదరాబాదులోని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సందడి చేశారు. 6 కొత్త వాహనాలకు పవన్ రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ ప్రక్రియను పూర్తి చేసేందుకు పవన్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. రిజిస్ట్రేషన్ తో పాటు పవన్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ కూడా పొందారు. ఈ ప్రక్రియను డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పాపారావు, ఖైరతాబాద్ రీజినల్ ట్రాన్స్ పోర్ట్ అధికారి రాంచందర్ పర్యవేక్షించారు. 

కాగా, పవన్ రిజిస్ట్రేషన్ చేయించిన వాహనాల్లో టయోటా వెల్ ఫైర్, బెంజి కారు, జీప్ ర్యాంగ్లర్, రెండు స్కార్పియో కార్లు, టాటా యోధ పికప్ ట్రక్ ఉన్నాయి.

  • Loading...

More Telugu News