Stock Market: కరోనా ఎఫెక్ట్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

  • 980 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
  • 320 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • 5 శాతం వరకు పడిపోయిన టాటా స్టీల్ షేర్ విలువ
Stock markets collapses

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీగా నష్టపోయాయి. వరుసగా నాలుగో సెషన్ లో నష్టాలను మూటకట్టుకున్నాయి. అంతర్జాతీయంగా పెరుగుతున్న కరోనా కేసులతో పాలు, వడ్డీ రేట్లను అమెరికన్ ఫెడ్ మళ్లీ పెంచుతుందనే అంచనాలతో ఇన్వెస్టర్ సెంటిమెంట్ దెబ్బతింది. దీంతో, వారు అమ్మకాలకు మొగ్గు చూపారు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 980 పాయింట్లు పతనమై 59,845కి పడిపోయింది. నిఫ్టీ 320 పాయింట్లు కోల్పోయి 17,806కి దిగజారింది. ఈరోజు అన్ని సూచీలు నష్టాల్లోనే ముగిశాయి.  

బీఎస్ఈ సెన్సెక్స్ లో కేవలం టైటాన్ మాత్రం ఎలాంటి మార్పు లేకుండా నిలిచింది. మిగిలిన కంపెనీల షేర్లన్నీ నష్టాల్లోనే ముగిశాయి. టాటా స్టీల్ (4.97), టాటా మోటార్స్ (4.07), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.27), బజాజ్ ఫిన్ సర్వ్ (3.07), రిలయన్స్ (2.96) నష్టపోయాయి.

More Telugu News