Kaikala Satyanarayana: కరోనా కారణంగా ఆయన బలహీనం అయ్యారు: కైకాల సత్యనారాయణ సోదరుడు

He suffered from respiratory problems says Kaikala Satyanarayana brother Nageswara Rao
  • శీతాకాలంలో సత్యనారాయణ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడేవారని తెలిపిన ఆయన సోదరుడు
  • ఇటీవల అదే కారణంతో ఆసుపత్రిలో చేరారని వెల్లడి
  • కొంత కాలంగా ఇంట్లో చికిత్స పొందుతున్నారన్న సోదరుడు నాగేశ్వరరావు
దాదాపు 750కి పైగా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయిన కైకాల సత్యనారాయణ మృతి వార్తతో ఇరు తెలుగు రాష్ట్రాలు దిగ్భాంతికి గురయ్యాయి. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతికి సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. మరోవైపు కైకాల సత్యనారాయణ సోదరుడు, నిర్మాత నాగేశ్వరరావు మాట్లాడుతూ, శీతాకాలంలో శ్వాస తీసుకోవడంలో అన్నయ్య ఇబ్బంది పడుతుంటారని... ఇటీవల కూడా అదే కారణంతో ఆసుపత్రిలో చేరారని తెలిపారు. కొంత కాలంగా ఇంట్లోనే చికిత్స పొందుతున్నారని తెలిపారు. 

ఈ తెల్లవారుజామున ఇంట్లోనే తుదిశ్వాస విడిచారని చెప్పారు. గత ఏడాది కరోనా బారిన పడి చాలా బలహీనంగా అయ్యారని తెలిపారు. రేపు మధ్యాహ్నం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలను నిర్వహిస్తామని చెప్పారు. మరోవైపు అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని మా అసోసియేషన్ కార్యాలయం వద్ద ఉంచనున్నారు.
Kaikala Satyanarayana
Tollywood

More Telugu News