రేవంత్ .. శ్రీహాన్ లలో నేను గమనించింది అదే: రోహిత్

  • బిగ్ బాస్ లో టాప్ 5లో నిలిచిన రోహిత్
  • కావాలని గీతూ గొడవపడేదని వ్యాఖ్య 
  • రేవంత్ ఎక్కువ చెప్పుకునేవాడని వెల్లడి 
  • శ్రీహాన్ అర్థంకాని పజిల్ అంటూ విమర్శ 
  • ఆదిరెడ్డిలో అదే నచ్చిందని వివరణ  
Bigg Boss 6  Update

బిగ్ బాస్ సీజన్ 6లో రోహిత్ టాప్ 5లో నిలిచాడు. గ్రాండ్ ఫినాలేలో ఆయన హౌస్ లో నుంచి బయటికి రావడం జరిగింది. తాజా ఇంటర్వ్యూలో రోహిత్ మాట్లాడుతూ .. 'బిగ్ బాస్ హౌస్'లో గీతూ మా విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకునేది. వాంటెడ్ గా గొడవకి దిగుతున్నట్టుగా అనిపించేది. ఆమె ఎందుకలా చేస్తుందనేది మాకు అర్థమయ్యేది కాదు" అన్నాడు. 

రేవంత్ విషయానికొస్తే తాను బాగా ఆడాలనీ .. గెలవాలనే ఒక కసి ఉండేది. ఆయనలోని ఆ పట్టుదల నాకు నచ్చేది. కానీ తన గురించి తాను ఎక్కువగా చెప్పుకునేవాడు .. అంత అవసరం లేదు కూడా. తాను మాట్లాడే విధానం కూడా కాస్త రఫ్ గానే ఉంటుంది. శ్రీహాన్ కొన్ని సార్లు స్వీట్ పర్సన్ అనిపించేవాడు .. కొన్నిసార్లు అర్థంకాని పజిల్ మాదిరిగా అనిపించేవాడు" అని చెప్పాడు. 

"ఇక శ్రీసత్యతో నేను ఎక్కువగా మాట్లాడింది లేదు. తను ఎక్కువగా రేవంత్ - శ్రీహాన్ తోనే హౌస్ లో ఉంటూ వచ్చింది. ఆదిరెడ్డి విషయానికొస్తే, నామినేషన్స్ సమయంలో కొన్ని సార్లు ఆయన వాదించేవాడు. కొన్నిసార్లు మాత్రం రీజన్ కరెక్టుగానే ఉందని చెప్పేసి ఒప్పుకునేవారు. ఆయన అలా జన్యూన్ గా ఉండటం నాకు నచ్చింది" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News