Taj Mahal: కొవిడ్ పరీక్షలు చేయించుకున్నవారికే తాజ్ మహల్ సందర్శనకు అనుమతి

  • చైనా సహా పలు దేశాల్లో పెరుగుతున్న కరోనా కేసులు
  • అప్రమత్తమైన భారత ప్రభుత్వం
  • కొవిడ్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చిన వారికి మాత్రమే తాజ్ ను సందర్శించేందుకు అనుమతి
Only those who have undergone covid tests are allowed to visit the Taj Mahal

కరోనా మహమ్మారి మరోసారి ప్రపంచాన్ని భయపెడుతోంది. చైనా సహా పలు దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమయింది. మరోవైపు ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రదేశం తాజ్ మహల్ ను సందర్శించే పర్యాటకులకు యూపీ ప్రభుత్వం కండిషన్ పెట్టింది. 

ప్రతిరోజూ వేలాది మంది దేశీయ, వీదేశీ పర్యాటకులు తాజ్ మహల్ సందర్శనకు వస్తుంటారు. ఈ నేపథ్యంలో, కొవిడ్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చిన వారిని మాత్రమే తాజ్ సందర్శనకు అనుమతిస్తామని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజ్ ను చూడటానికి వచ్చేవాళ్లు సందర్శనకు ముందే కొవిడ్ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందని తెలిపింది. 

మరోవైపు యూపీ డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్ మాట్లాడుతూ, మాస్క్ ధరించి మాత్రమే బయటకు రావాలని ప్రజలను కోరారు. ఇన్ఫెక్షన్ ప్రభావిత దేశాల నుంచి వచ్చేవారిని విమానాశ్రయాల్లోనే టెస్ట్ చేయాలని చెప్పారు. విదేశాల నుంచి వచ్చే వారిపై నిఘా ఉంచాలని అన్నారు.

More Telugu News