Bonda Uma: జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి వైసీపీ జిల్లా అధ్యక్షుడిలా పని చేస్తున్నారు: బొండా ఉమ

Palnadu SP is working as YSRCP leader says Bonda Uma
  • వైసీపీ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదన్న బొండా ఉమ
  • టీడీపీ నేతలపైనే తిరిగి కేసులు పెడుతున్నారని మండిపాటు
  • ఎస్పీ రవిశంకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డిపై టీడీపీ నేత బొండా ఉమ విమర్శలు గుప్పించారు. జిల్లా ఎస్పీలా కాకుండా వైసీపీ జిల్లా అధ్యక్షుడి మాదిరి ఆయన వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ఎన్నో రోజులు అధికారంలో ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. టీడీపీ నేతల ఇళ్లు, కార్లను వైసీపీ నేతలు తగులు బెడితే వారిపై కేసులు పెట్టకుండా, కాపాడుతున్నారని విమర్శించారు. 

శాంతిభద్రతలను కాపాడటం మానేసి, వైసీపీ నేతల కంటే ఎక్కువ చేస్తున్న రవిశంకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు మరో టీడీపీ నేత యరపతినేని కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. పల్నాడు ఎస్పీ ఫ్యాక్షనిస్టు మాదిరి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పోలీసులను డీజీపీ అదుపులో పెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
Bonda Uma
Telugudesam
YSRCP
Palnadu SP

More Telugu News