విజయనగరం జిల్లా పర్యటనకు వెళుతున్న చంద్రబాబుకు వైజాగ్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం
- విజయనగరం జిల్లాలో చంద్రబాబు పర్యటన
- నేటి నుంచి ఈ నెల 24 వరకు పర్యటన
- చంద్రబాబు రాకతో వైజాగ్ ఎయిర్ పోర్టు వద్ద కోలాహలం
కాగా, విజయనగరం జిల్లాలో చంద్రబాబు నేటి నుంచి ఈ నెల 24 వరకు పర్యటించనున్నారు. ఈ సాయంత్రం రాజాంలో రోడ్ షోతో ఆయన పర్యటన ప్రారంభం అవుతుంది. రాజాం సీబీఎం చర్చిలో జరిగే సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు.
ఈ నెల 23న బొబ్బిలి నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఓబీసీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ నెల 24న విజయనగరంలో రోడ్ షోలు, రైతులతో సమావేశం నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం కోట జంక్షన్ లో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు
