Bandi Sanjay: హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఓ మతానికి కొమ్ముకాస్తున్నారు: బండి సంజయ్

Bandi Sanjay alleges Telangana DH Srinivasarao supports a religion
  • కొత్తగూడెంలో సెమీ క్రిస్మస్ వేడుకలు
  • హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వ్యాఖ్యలు వివాదాస్పదం
  • ఏసు క్రీస్తు వల్లే కరోనా వ్యాప్తి తగ్గిందని వెల్లడి
  • ఆ దేవుడే ప్రజలను కాపాడతాడా అంటూ బండి సంజయ్ ఫైర్
తెలంగాణ ఆరోగ్య విభాగం డైరెక్టర్ శ్రీనివాసరావు ఏసు క్రీస్తు కృప వల్లే కరోనా వ్యాప్తి తగ్గిందంటూ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు. హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఓ మతానికి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. ప్రజలను ఓ మతానికి చెందిన దేవుడే కాపాడతాడా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే టికెట్ కోసం హెల్త్ డైరెక్టర్ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెల్త్ డైరెక్టర్ ఒక అవినీతిపరుడని, అతడి అవినీతిని నిరూపిస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు. 

కొత్తగూడెంలో నిన్న జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, కరోనా తగ్గింది మనం చేసిన సేవల వల్ల కాదు... ఏసు క్రీస్తు వల్లేనని వ్యాఖ్యానించారు. మంచిని ప్రేమించాలని, మంచిని ఆచరించాలని చెప్పే మిగిలిన అన్ని జాతుల ధర్మాలను ముందుకు తీసుకుపోవడం వల్ల మానవాళిని కాపాడుకోగలిగామని అన్నారు. అయితే, ఆయన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి.
Bandi Sanjay
Srinivasarao
Health Director
BJP
Telangana

More Telugu News