Alapati Raja: మాటకు కట్టుబడి అంబటి రాంబాబు వెంటనే రాజీనామా చేయాలి: ఆలపాటి రాజా

  • ప్రతిపక్షాలపై దాడికి పోలీసు వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం వాడుకుంటోందన్న ఆలపాటి
  • పల్నాడు ఎస్పీ ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నారని విమర్శ
  • పోలీసుల సమక్షంలోనే టీడీపీ ఆఫీసుకు నిప్పు పెట్టారని మండిపాటు
Alapati Raja demands Ambati Rambabu to resign

ప్రతిపక్షాలపై దాడి చేసేందుకు పోలీసు వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం వాడుకుంటోందని టీడీపీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజా విమర్శించారు. మాచర్లలో జరిగిన ఘటనే దీనికి కారణమని చెప్పారు. పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉన్నప్పుడు టీడీపీ నిర్వహిస్తున్న కార్యక్రమాల వద్దకు వైసీపీ నేతలు ఎందుకొచ్చారని ప్రశ్నించారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ ఆఫీసుకు నిప్పు పెట్టారని దుయ్యబట్టారు. ప్రజలను రక్షిస్తారా? లేక అధికార పార్టీ నేతల మోచేతి నీళ్లు తాగుతారో పోలీసులే తేల్చుకోవాలని అన్నారు. పల్నాడు ఎస్పీ ఒక ఫ్యాక్షనిస్టు మాదిరి వ్యవహరిస్తున్నారని చెప్పారు. 

మృతుడి కుటుంబానికి ఇచ్చిన పరిహారం సొమ్ములో లంచం అడిగారంటూ మంత్రి అంబటి రాంబాబుపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. తాను లంచం తీసుకున్నట్టు నిరూపిస్తే మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తానని అంబటి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. అయితే ఆయన లంచం డిమాండ్ చేసినట్టు బాధితులు మాట్లాడిన వీడియోలు మీడియాలో వచ్చాయి. దీంతో, చెప్పిన మాటపై నిలబడి అంబటి రాంబాబు వెంటనే రాజీనామా చేయాలని ఆలపాటి రాజా డిమాండ్ చేశారు.

More Telugu News