Avatar2: భారత్​ లో తగ్గని అవతార్2 హవా.. రూ.200 కోట్లకు చేరువగా కలెక్షన్స్

Avatar2 The Way of Water box office collection Day 6
  • ఆరో రోజు రూ. 15 కోట్ల వసూళ్లు
  • దక్షిణాది ప్రేక్షకుల నుంచి చిత్రానికి అద్భుత స్పందన
  • తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 40 కోట్లు రాబట్టిన సినిమా
‘అవతార్ 2’కు ప్రపంచ వ్యాప్తంగా మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ భారత్ లో మాత్రం దూసుకెళ్తోంది. మన దేశంలో 4 వేల పైచిలుకు థియేటర్లలో విడుదలై తొలి రోజే 40 కోట్ల రూపాయలు రాబట్టింది. భారతీయ మార్కెట్‌లో ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’ తర్వాత రెండో అత్యధిక బాక్సాఫీస్ ఓపెనర్‌గా నిలిచింది. అవెంజర్స్ 2019లో విడుదలైన తొలి రోజున రూ. 53.10 కోట్లు రాబట్టింది. జేమ్స్ కామెరూన్ రూపొందించిన అవతార్2 కలెక్షన్ల వర్షం ఆగడం లేదు. ప్రతి రోజూ 10 కోట్ల పైనే రాబడుతోంది. గత శుక్రవారం విడుదలైన అవతార్2 ఆరో రోజైన బుధవారం రూ. 15.25 కోట్లు వసూలు చేయగలిగింది. 

దాంతో, భారత బాక్సాఫీస్ లో రూ. 200 కోట్ల కలెక్షన్ల మార్కుకు చేరువలోకి వచ్చేసింది. ముఖ్యంగా దక్షిణ భారతం నుంచి ఈ చిత్రం రికార్డు స్థాయి కలెక్షన్లను సాధించింది. మొత్తం కలెక్షన్ రూ.179.30 కోట్లకు చేరుకుంది. ఒకటి రెండు రోజుల్లో ఈ చిత్రం రూ. 200 కోట్ల మార్కు దాటనుంది. శని, ఆదివారాల్లో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు.  నైజాం, ఆంధ్రా నుంచే ఇప్పటిదాకా రూ. 40 కోట్లు రావడం విశేషం.
Avatar2
Hollywood
India
collections
200cr

More Telugu News