Team India: 2010లో అరంగేట్రం.. 2022లో తొలి వికెట్

Unadkat takes his maiden test wicket 12 years after his debet
  • 12 ఏళ్ల తర్వాత భారత జట్టులోకి వచ్చి ఆకట్టుకున్న పేసర్ ఉనాద్కట్
  • రెండో టెస్టులో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్
  • 82/2 స్కోరుతో లంచ్ విరామానికి వెళ్లిన ఆతిథ్య జట్టు
బంగ్లాదేశ్ తో రెండో టెస్టును భారత్ మెరుగ్గా ఆరంభించింది. టాస్ నెగ్గి బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. లంచ్ విరామ సమాయానికి 82/2 స్కోరుతో నిలిచింది. 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత టెస్టు జట్టులోకి తిరిగొచ్చిన జైదేవ్ ఉనాద్కట్ భారత్ కు తొలి బ్రేక్ అందించాడు. మంచి లైన్ అండ్ లెంగ్త్ తో బౌలింగ్ చేసిన అతను తొలి మ్యాచ్ లో సెంచరీ హీరో జాకిర్ హసన్ (15)ను 15వ ఓవర్లో పెవిలియన్ చేర్చాడు. టెస్టుల్లో అతనికిదే తొలి వికెట్ కావడం గమనార్హం. 

2010లో దక్షిణాఫ్రికాపై తన తొలి, ఏకైక టెస్టు మ్యాచ్ ఆడిన ఉనాద్కట్ కు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత భారత జట్టులో అవకాశం లభించింది. తర్వాతి ఓవర్లోనే మరో ఓపెనర్ నజ్ముల్ హసన్ శాంటో (24)ను రవిచంద్రన్ అశ్విన్ ఎల్బీగా వెనక్కిపంపాడు. దాంతో, బంగ్లాదేశ్ 39/2తో ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో మోమినుల్ హక్ (23 బ్యాటింగ్), కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (16 బ్యాటింగ్) ఇన్నింగ్స్ ను ఆదుకున్నారు. మరో వికెట్ ఇవ్వకుండా జట్టును లంచ్ బ్రేక్ కు తీసుకెళ్లారు. అశ్విన్ బౌలింగ్ లో షకీబ్ ను స్టంపౌట్ చేసే అవకాశాన్ని కీపర్ పంత్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
Team India
test
Bangladesh
2nd test
unadkat
wicket

More Telugu News