Bangladesh: బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు.. కుల్దీప్ అవుట్, ఉనద్కత్ ఇన్

Bangladesh Won The Toss And Opt To Bat First in Second Test
  • ఒక్క మార్పుతో భారత్, రెండు మార్పులతో బంగ్లాదేశ్ బరిలోకి
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్
  • ఇరుజట్లకు కీలకంగా మారిన టెస్ట్
భారత్-బంగ్లాదేశ్ మధ్య ఢాకా లోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో రెండో టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టెస్టును టీమిండియా ఇప్పటికే సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ టెస్టు ఇరు జట్లకు ఎంతో కీలకం. ఈ టెస్టులోనూ గెలిస్తే సిరీస్ భారత్ సొంతమవుతుంది. ఓడితే సిరీస్ సమమవుతుంది. కాబట్టి విజయం సాధించడం ద్వారా సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భారత్ భావిస్తోంది. 

ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. తొలి టెస్టులో అద్భుత బౌలింగుతో జట్టుకు విజయాన్ని చేకూర్చి పెట్టిన కుల్దీప్ యాదవ్ స్థానంలో ఉనద్కత్ జట్టులోకి వచ్చాడు. బంగ్లాదేశ్ జట్టులో రెండు మార్పులు జరిగాయి. యాసిర్ స్థానంలో మోమినుల్ హక్, ఎబడట్ స్థానంలో తస్కిన్ అహ్మద్ జట్టులోకి వచ్చారు. రోహిత్ శర్మ ఈ టెస్టుకు కూడా దూరం కావడంతో స్టాండిన్ కెప్టెన్ కేఎల్ రాహుల్ భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
Bangladesh
Team India
Dhaka

More Telugu News