Istanbul: ఆహారం విషయంలో విమానంలో గొడవ.. అరుచుకున్న ఎయిర్‌హోస్టెస్-ప్రయాణికుడు.. వీడియో వైరల్!

Airhostess and passenger scuffle in indigo flight
  • ఇస్తాంబుల్-ఢిల్లీ విమానంలో ఈ నెల 16న గొడవ
  • నువ్వు సేవకురాలివన్న ప్రయాణికుడు
  • కాదు, ఉద్యోగినన్న ఎయిర్‌హోస్టెస్
  • నోర్మూసుకోమంటూ పరస్పరం వాదులాట
విమానంలో ప్రయాణికుడు-ఎయిర్‌హోస్టెస్ మధ్య జరిగిన వాగ్వివాదానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆహారం విషయంలో జరిగిన ఈ గొడవలో ఇద్దరూ ఒకరిపై ఒకరు గట్టిగా అరుచుకున్నారు. చివరికి సహోద్యోగి వారించడంతో గొడవ సద్దుమణిగింది. ఇస్తాంబుల్-న్యూఢిల్లీ ఇండిగో విమానంలో ఈ నెల 16న జరిగిందీ ఘటన. ఈ ఘటనను చిత్రీకరించిన ప్రయాణికుడు తాజాగా ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది.

ఆ వీడియో ప్రకారం.. ఎయిర్‌హోస్టెస్ ఓ వ్యక్తితో మాట్లాడుతూ.. మీ వల్ల మా ఉద్యోగి ఏడుస్తున్నారని, బోర్డింగ్ పాస్‌లో ఏముంటే దాని ప్రకారమే ఆహారాన్ని అందిస్తామని చెప్పారు. దీనికతడు తీవ్రంగా స్పందించాడు. ప్రయాణికుడికి నువ్వు సేవకురాలివని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. దానికామె కూడా తీవ్రంగా స్పందించారు. తాను పనిమనిషిని కాదని, ఉద్యోగినని తీవ్ర స్వరంతో చెప్పారు. దీనికి అతడు ‘ఎందుకలా అరుస్తున్నావ్? నోర్మూసుకో’ అని హెచ్చరించాడు. ‘నువ్వు కూడా నోర్మూసుకో’ అని ఎయిర్‌హోస్టెస్ బదులిచ్చింది. దీంతో కల్పించుకున్న సహోద్యోగి సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది.
Istanbul
New Delhi
Indigo 6E

More Telugu News