Khudiram Bose: పార్లమెంటు సభ్యుల కోసం నేడు ‘ఖుదీరామ్ బోస్’ ప్రత్యేక ప్రదర్శన

  • ఖుదీరామ్ బోస్ జీవిత చరిత్ర ఆధారంగా పాన్ ఇండియా మూవీ
  • ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలోని ఫిల్మ్స్ డివిజన్ ఆడిటోరియంలో చిత్ర ప్రదర్శన
  • తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ భాషల్లో విడుదల
Khudiram Bose Movie To be screened for Parliamentarians

స్వాతంత్ర్య సమరయోధుడు ఖుదీరామ్ బోస్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన సినిమా ‘ఖుదీరామ్ బోస్’. మరుగున పడిపోయిన ఆయన జీవితం గురించి ప్రపంచానికి తెలియజెప్పాలన్న ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జాగర్లమూడి పార్వతి సమర్పణలో గోల్డెన్ రెయిన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రజితా విజయ్ జాగర్లమూడి నిర్మించిన ఈ సినిమాకు డీవీఎస్ రాజు దర్శకత్వం వహించారు. రాకేశ్ జాగర్లమూడి టైటిల్ పాత్ర పోషించారు. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించగా, జాతీయ అవార్డు విజేత తోట తరణి ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరించారు. స్టంట్ డైరెక్టర్‌గా కనల్ కణ్ణన్, సినిమాటోగ్రాఫర్‌గా రూసూల్ ఎల్లోర్, ఎడిటర్‌గా మార్తాండ్ కె. వెంకటేశ్, రైటర్‌గా బాలాదిత్య వ్యవహరించారు. 

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదలవుతున్న ఈ సినిమాను ఇటీవల గోవాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించారు. పార్లమెంటు సభ్యుల కోసం ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఢిల్లీ మహాదేవ్ రోడ్డులోని ఫిల్మ్స్ డివిజన్ ఆడిటోరియంలో ప్రదర్శన ఏర్పాటు చేశారు.

More Telugu News