Bharat Jodo: యాత్ర ఆపాలా..? ఏదైనా విమానాశ్రయానికి వెళ్లి చూడండి.. : కేంద్రమంత్రికి కాంగ్రెస్ కౌంటర్

  • విమానాశ్రయాల్లో మాస్క్ పెట్టుకోవాలని అడగడం లేదన్న కాంగ్రెస్ నేత పవన్ ఖెరా
  • పార్లమెంట్ సమావేశాలు వాయిదా వేసుకున్నారా? అని ప్రశ్న
  • రాహుల్ గాంధీ, భారత్ జోడో యాత్రకే ఎందుకు నిబంధనలంటూ నిలదీత
Are you sending letter Congress on Bharat Jodo Covid alert Go to any airport

భారత్ జోడో యాత్రను వాయిదా వేసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. జన్ అకర్ష్ యాత్ర నిర్వహిస్తున్న బీజేపీ రాజస్థాన్ చీఫ్ సతీష్ పూనియాకు ఇదే సలహా ఇస్తూ లేఖ రాయగలరా? అని కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయను కాంగ్రెస్ పార్టీ నేత పవన్ ఖెరా ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం కేవలం రాహుల్ గాంధీ యాత్రనే చూస్తుంది తప్పించి, రాజస్థాన్, కర్ణాటకలో బీజేపీ చేపట్టిన యాత్రలను చూడడం లేదని విమర్శించారు. ఈ యాత్రలకు పెద్దగా జనాకర్షణ లేదంటూ దెప్పి పొడిచారు.

కేవలం రాహుల్ గాంధీకి లేఖ రాయడం అంటే, ఆయన్ని, భారత్ జోడో యాత్రను టార్గెట్ చేసుకోవడమేనని పవన్ ఖెరా అన్నారు. ‘‘భారత్ జోడో యాత్రకు ఎంతో ఆదరణ లభిస్తుండడం, ప్రజలు భారీగా పాల్గొంటుండడం చూస్తున్నాం. కానీ, అసలు కొవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయా? ఏ విమానాశ్రయానికి అయినా వెళ్లి చూడండి. మాస్క్ ధరించాలని ఎవరూ అడగరు. ఎందుకని ప్రజా రవాణాలో ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేయడం లేదు? రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ కు, భారత్ జోడో యాత్రకు ఈ నిబంధనలు ఎందుకు? పార్లమెంట్ సమావేశాలను వాయిదా వేసుకున్నారా?’’ అని పవన్ ఖెరా ప్రశ్నించారు.

More Telugu News