Ram Charan: రామ్ చరణ్ ఇంట క్రిస్ మస్ ‘మెగా’ సెలబ్రేషన్స్.. యువతారలంతా అక్కడే!

Ram Charan Upasana host annual Christmas party with cousins Allu Arjun Varun Tej
  • వేడుకలకు హాజరైన అల్లు అర్జున్ దంపతులు, శిరీష్, వరుణ్ తేజ్
  • రామ్ చరణ్ సోదరీమణులు సైతం హాజరు
  • ఏటా క్రిస్ మస్ సందర్భంగా రామ్ చరణ్ ఇంట పార్టీ
రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఏటా క్రిస్ మస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంటారు. అత్యంత సన్నిహితులను వారు సంబరాలకు ఆహ్వానిస్తుంటారు. ఇప్పుడు కూడా రామ్ చరణ్ దంపతులు క్రిస్ మస్ వేడుకలను నిర్వహిస్తుండగా, దీనికి అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. 

ఇందుకు సంబంధించిన గ్రూప్ ఫొటోను ఉపాసన ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్ లో షేర్ చేశారు. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, అల్లు శిరీష్, రామ్ చరణ్ తోబుట్టువులు, నీహారిక తదితరులు ఇందులో ఉన్నారు. రామ్ చరణ్ దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ విషయాన్ని చిరంజీవి ప్రకటించారు.
Ram Charan
Upasana
Christmas party
Allu Arjun
Varun Tej
celebrations

More Telugu News