గూగుల్ ఫైల్స్ యాప్ లో డిజీలాకర్ త్వరలోనే..!
- నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ తో గూగుల్ భాగస్వామ్యం
- ఆండ్రాయిడ్ ఫోన్ ఫైల్స్ యాప్ తో డిజీలాకర్ అనుసంధానం
- త్వరలోనే ఈ సేవలు అందుబాటులోకి
ఇప్పుడు గూగుల్ నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ తో ఒప్పదం చేసుకుంది. డిజీలాకర్ సర్వీస్ ను తన ఆండ్రాయిడ్ ఫైల్స్ యాప్ లో భాగంగా ఆఫర్ చేయనుంది. దీంతో ప్రభుత్వం విడుదల చేసే అన్ని రకాల ముఖ్యమైన డాక్యుమెంట్లను ఆండ్రాయిడ్ యూజర్లు తమ స్మార్ట్ ఫోన్లో ఫైల్స్ యాప్ నుంచే పొందడం సులభం అవుతుంది. త్వరలోనే ఈ సేవను అందించనున్నట్టు గూగుల్ ప్రకటించింది. డిజీలాకర్ యూజర్లు 2022 మార్చి నాటికి 10 కోట్లు దాటడం గమనార్హం.