Raw food: వండింది తినాలా.. లేక వండకుండా తింటే మంచిదా?

  • వండి తీసుకోవడం వల్ల కొన్ని ప్రయోజనాలు
  • వండకుండా తీసుకోవడం వల్ల కొన్ని లాభాలు
  • సంప్రదాయంగా వస్తున్న విధానాల్లో తీసుకోవడమే ఉత్తమం
Raw vs cooked food nutritionist on which is better

రా ఫుడ్ (వండనిది, ఒరిజినల్ రూపంలో ఉన్నది) తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయని ఎన్నో అధ్యయనాల్లో వెల్లడైంది. వండని పదార్థాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు ఇది మంచి పరిష్కారమని పలు అధ్యయనాలు వెల్లడించాయి. 

మరోవైపు వండని ఆహార పదార్థాల కంటే వండినవి సులభంగా జీర్ణమవుతాయని వైద్యులు చెబుతుంటారు. వండని పదార్థాల్లో యాంటీ న్యూట్రియంట్లు (పోషకాలు మన శరీరం గ్రహించకుండా అడ్డుకునే కాంపౌండ్లు) ఉంటాయి. వండడం వల్ల ఇవి నశించి, మన శరీరానికి మంచి పోషకాలు అందుతాయని అంటుంటారు.  దీంతో చాలా మందికి ఎలా తీసుకోవాలన్న సందేహం ఏర్పడుతుంటుంది.

మన నిత్య జీవితంలో భాగంగా కొన్నింటిని వండి తింటుంటాం. కొన్ని వండకుండా తీసుకుంటాం. కూరగాయలను వండినవే తీసుకుంటాం. ఆనియన్, దోసకాయ, పచ్చి మిరపకాయలను వండకుండానూ తింటుంటాం. మొలకెత్తిన గింజలను ఉడికించకుండానే తింటాం. నట్స్ ను కూడా రా రూపంలోనే తీసుకుంటాం. వండని పదార్థాలు, వండిన పదార్థాల్లోనూ ప్రయోజనాలున్నాయి. కనుక సంప్రదాయంగా మన పెద్దలు అనుసరించే మార్గంలోనే ఆహార పదార్థాలను తీసుకోవాలన్నది నిపుణుల సూచన.

వండడం వల్ల ఆయా పదార్థాల్లో ఉండే నీరు ఆవిరైపోతుంది. దీనివల్ల నీటిలో కరిగిపోయే విటమిన్లు తగ్గిపోతాయి. పండ్లలో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. అందుకని పండ్లను ఎలా ఉంటే అలానే తినేయాలి. వండని పచ్చి మిరపకాయల్లో నిమ్మకాయ కంటే ఎక్కువ విటమిన్ సీ ఉంటుంది. కనుక పచ్చిమిరపను వండకుండా తినడం మంచిది. కొన్ని రకాల ఆహారాల్లో బ్యాక్టీరియా చేరడం వల్ల, వాటిని వండకుండా తింటే అనారోగ్యం ఏర్పడుతుంది. ముఖ్యంగా జంతు సంబంధిత ఆహారానికి ఇది వర్తిస్తుంది. సులభంగా జీర్ణం అవ్వడంతోపాటు, ఆహారంలోని పోషకాలు శరీరానికి మంచిగా పడతాయి.

More Telugu News