క్రిస్మస్ కు థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు
- ధమాకా తో వస్తున్న రవితేజ, శ్రీలీల
- నిఖిల్ సినిమా 18 పేజెస్ రిలీజ్ ఈ నెల 23న
- నయనతార నటించిన కనెక్ట్ కూడా వచ్చేస్తోంది
ధమాకా..
రవితేజ, శ్రీలీల ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ధమాకా చిత్రానికి త్రినాధరావు దర్శకత్వం వహించారు. రవితేజ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా ఈ నెల 23న థియేటర్లలో రిలీజ్ కానుంది.
18 పేజెస్..
ఘన విజయం సాధించిన కార్తికేయ 2 సినిమా తర్వాత నిఖిల్ కొత్త సినిమా 18 పేజెస్. ఇందులో నిఖిల్ సరసన అనుపమ నటించారు. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా ఈ నెల 23న రిలీజ్ కానుంది.
లాఠీ..
విశాల్ హీరోగా తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిన సినిమా లాఠీ.. ఈ నెల 22న రిలీజ్ కానున్న ఈ సినిమాలో హీరోయిన్ గా సునయన నటించారు.
సర్కస్..
రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్ వీర్ సింగ్, పూజాహెగ్డే, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం సర్కస్.. ఈ సినిమా ఈ నెల 23న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.