Dimple Hayathi: కోలకళ్లతో కొంటె చూపులు .. డింపుల్ హయతి లేటెస్ట్ పిక్స్!

Dimple Hayathi Special
  • చిన్న పాత్రలతో కెరియర్ మొదలెట్టిన డింపుల్  
  • 'గద్దలకొండ గణేశ్' ఐటమ్ తో గుర్తింపు 
  • 'ఖిలాడి'తో హీరోయిన్ గా ఎంట్రీ 
  • హాట్ లుక్స్ తో కట్టిపడేస్తున్న భామ
టాలీవుడ్ కి ఈ మధ్య కాలంలో పరిచయమైన కథానాయికలలో డింపుల్ హయతి ఒకరు. డింపుల్ హైదరాబాదీ అమ్మాయినే. 2017లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, అప్పటి నుంచి కుదురుకోవడానికి తనవంతు ప్రయత్నం చేస్తూనే వెళుతోంది. 'గద్దలకొండ గణేశ్' సినిమాలో చేసిన 'జర్రా జర్రా' ఐటమ్ ఆమెకి మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఇక ఆ తరువాత ఆమె రవితేజ జోడీగా 'ఖిలాడి' సినిమా చేసింది. ఈ సినిమాలో ఆమె ఎలాంటి మొహమాటాలకు పోకుండా అందాలను ఆరబోసింది. కుర్రాళ్లంతా కూడా ఆమెను చూపులతోనే చుట్టేశారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ఆమె గ్లామర్ కి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో కూడా నిలదొక్కుకునే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఈ సుందరి లేటెస్ట్ పిక్స్ ను వదిలారు. గ్రీన్ కలర్ క్రాప్ టాప్ లో డింపుల్ మెరిసిపోతోంది. కోలకళ్లతో కొంటె చూపులు రువ్వుతోంది. గ్రీన్ కలర్ స్టోన్స్ పొదిగిన ఆర్నమెంట్స్ ను ధరించి, అందానికి ఆనవాలుగా అనిపిస్తోంది. పదునైన చూపులతో పడుచు మనసులను ఖాళీ చేస్తున్న ఈ బ్యూటీని, వరుస అవకాశాలు వరిస్తాయేమో చూడాలి.
Dimple Hayathi
Actress
Tollywood

More Telugu News