Jogi Ramesh: పవన్, ఆయన దత్త తండ్రి వైసీపీ కంచుకోటను ఇంచు కూడా కదల్చలేరు: జోగి రమేశ్

  • పవన్ కల్యాణ్ కు జెండా, అజెండా లేవన్న జోగి రమేశ్
  • ఏదో వాగి పోతుంటాడని వ్యాఖ్యలు
  • పవన్ ను నమ్మితే నట్టేట మునుగుతారని ఎద్దేవా  
Jogi Ramesh slams Pawan and Chandrababu

ఏపీ మంత్రి జోగి రమేశ్ జనసేనాని పవన్ కల్యాణ్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. జెండా, అజెండా లేని వ్యక్తి పవన్ కల్యాణ్ అని, విజిటింగ్ వీసాపై రాష్ట్రానికి వచ్చి ఏదో వాగి పోతాడని వ్యాఖ్యానించారు. వారానికోసారి వచ్చి జనాన్ని రెచ్చగొడుతుంటాడని అన్నారు. పవన్ ను నమ్ముకుంటే జనసేన శ్రేణులు నట్టేట మునగడం ఖాయమని, పవన్ కు తెలిసిందల్లా చంద్రబాబుకు చెంచాగిరీ చేయడమేనని జోగి రమేశ్ విమర్శించారు. 

వైసీపీని ఓడిస్తాను, జగన్ ను దించేస్తాను అంటున్నాడు... పవన్ కాదు కదా, ఆయన దత్త తండ్రి చంద్రబాబు వచ్చినా వైసీపీ కంచుకోటను ఇంచు కూడా కదల్చలేరని స్పష్టం చేశారు. పవన్ కు దమ్ముంటే 175 స్థానాల్లో జనసేన అభ్యర్థులను పెట్టాలి అని సవాల్ విసిరారు. 

"వారాహి వాహనం మీద తిరుగుతావో, లేక వరాహం మీద తిరుగుతావో ఎవరు ఆపారు?" అంటూ ప్రశ్నించారు. పవన్ మాట్లాడుతున్న భాష పట్ల జోగి రమేశ్ స్పందించారు. తాము అలాంటి భాషను మాట్లాడలేమని, తమ నాయకుడు ప్రేమ, అభిమానంతో వ్యవహరించడమే నేర్పాడని అన్నారు.

అటు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు స్పందిస్తూ, పవన్ ఓ వారాలబ్బాయి అని వ్యాఖ్యానించారు. పవన్ రద్దయిన నోట్లతో సమానం అని ఎద్దేవా చేశారు.

More Telugu News