Sensex: దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు

  • ఫెస్టివల్ సీజన్ జోష్
  • 468 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 151 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. రెండు రోజుల నష్టాలకు ముగింపు పలికాయి. అంతర్జాతీయంగా అనుకూల పరిస్థితులు లేనప్పటికీ... మన దేశంలో పండుగల సమయం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు పాజిటివ్ ఫీలింగ్ తో ట్రేడింగ్ చేశారు. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 468 పాయింట్లు లాభపడి 61,806కి చేరుకుంది. నిఫ్టీ 151 పాయింట్లు పెరిగి 18,420 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (2.97%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.58%), భారతి ఎయిర్ టెల్ (2.31%), బజాజ్ ఫిన్ సర్వ్ (2.00%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.71%). 

టాప్ లూజర్స్:
టీసీఎస్ (-1.13%), ఇన్ఫోసిస్ (-0.97%), టాటా మోటార్స్ (-0.80%), సన్ ఫార్మా (-0.63%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.47%).

More Telugu News