బిగ్ బాస్ హౌస్ వదిలి వస్తుంటే బాధగా అనిపించింది: కీర్తి

  • బిగ్ బాస్ హౌస్ లో టాప్ త్రీగా నిలిచిన కీర్తి 
  • ఇన్ని రోజులు ఉంటానని అనుకోలేదని వ్యాఖ్య 
  • తన ఫ్యామిలీ పెద్దదైందని వెల్లడి 
  • ఇకపై మంచే జరుగుతుందన్న ఆశాభావం 
Keerthi Interview

బిగ్ బాస్ హౌస్ లో కీర్తి తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకుంది. ఒక ప్రమాదంలో తన కుటుంబ సభ్యులంతా చనిపోయి తాను మాత్రమే ప్రాణాలతో బయటపడినట్టుగా ఆమె చెప్పిన దగ్గర నుంచి ఆడియన్స్ కి ఆమె పట్ల మరింత అభిమానం పెరిగిపోయింది. నిజంగా కీర్తిలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని అనుకున్నారు.

చేతి వ్రేలుకి గట్టిగానే దెబ్బ తగిలినప్పటికీ, ఆమె ప్రతి గేమ్ లో ఆడుతూ వెళ్లింది. ఆమెలోని పట్టుదల అందరినీ ఆకట్టుకుంది. అలాంటి కీర్తి 3వ పొజిషన్లలో హౌస్ లో నుంచి బయటికి రావలసి వచ్చింది. తాజా ఇంటర్వ్యూలో కీర్తి మాట్లాడుతూ .. 'బిగ్ బాస్ హౌస్ లో నేను ఇన్ని రోజుల పాటు ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు. టాప్ 3గా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది" అని అంది. 

బిగ్ బాస్ హౌస్ ను వదిలి వచ్చేస్తుంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ కి ముందు నేను కొంతమందికే తెలుసు .. ఇప్పుడు ఎన్నో లక్షల మందికి తెలుసు. అలాంటి ఒక గుర్తింపును ఇచ్చిన బిగ్ బాస్ కి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఇకపై నా లైఫ్ లో అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చింది.

More Telugu News