Mammootty: ఫిఫా ఫుట్ బాల్ ఫైనల్స్ స్టేడియంలో మోహన్ లాల్, మమ్ముట్టి

Mammootty Mohanlal share selfies from FIFA World Cup Final say what a moment
  • సెల్ఫీలు దిగి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన నటులు
  • ఏమి వాతావరణం, ఏమి దృశ్యం అని పేర్కొన్న మమ్ముట్టి
  • మెస్సీ పోరాట పటిమను, ఫ్రాన్స్ క్రీడాస్ఫూర్తిని అభినందించిన మోహన్ లాల్
ఖతార్ లోఫిఫా ఫుట్ బాల్ ఫైనల్స్ మ్యాచ్ స్టేడియంలో కేరళకు చెందిన దిగ్గజ నటులు మోహన్ లాల్, మమ్ముట్టి సందడి చేశారు. ఫుట్ బాల్ ను వీరు ఎంతో ఇష్టపడతారని అభిమానులకు తెలిసిన విషయమే. ఫైనల్స్ కు తాము హాజరైన విషయాన్ని వీరు స్వయంగా తమ సామాజిక మధ్యమ వేదికలపై ప్రకటించారు. స్టేడియంలో తీసుకున్న సెల్ఫీ ఫొటోలను పోస్ట్ చేశారు.

మమ్ముట్టి కిక్కిరిసి ఉన్న స్టేడియంలో సెల్ఫీ తీసుకుని ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘అతిపెద్ద క్రీడా విన్యాసానికి సాక్షి. ఏమి వాతావరణం, ఏమి దృశ్యం’ అంటూ పోస్ట్ పెట్టారు. మరోవైపు ఎర్రటి షర్ట్ పై నల్లటి కోట్ వేసుకున్న మోహన్ లాల్ ఫైనల్స్ మ్యాచ్ ఆరంభానికి ముందు సెల్ఫీ తీసుకుని దాన్ని అభిమానులకు షేర్ చేశారు. మెస్సీ పోరాట పటిమను కొనియాడారు. తన గమ్యస్థానానికి చేరుకునే తేదీని మెస్సీ రాసి పెట్టుకున్నాడని పేర్కొన్నారు. చివరి వరకు గట్టి పోటీనిచ్చిన ఫ్రాన్స్ జట్టును కూడా అభినందించారు. 
Mammootty
Mohanlal
FIFA World Cup

More Telugu News