Nora Fatehi: ఫిఫా ప్రపంచ కప్ ముగింపు వేడుకల్లో ఈ బాలీవుడ్ నటి ప్రదర్శనే హైలైట్

Nora Fatehi stuns fans with her sizzling performance at FIFA World Cup final
  • అద్భుతమైన నృత్యంతో అలరించిన నోరా ఫతేహి
  • ‘లైట్ ది స్కై’ గీతానికి ప్రదర్శనతో ఉర్రూతలూగించిన నటి 
  • ఫైనల్ కు ముందు సందడి చేసిన షారూక్, దీపిక పదుకొణే 
యావత్ క్రీడా ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ లో అర్జెంటీనా అద్భుత ప్రదర్శన చేసింది. ఫ్రాన్స్ జట్టును పడగొట్టి ప్రపంచ చాంపియన్ గా నిలిచింది. ఇరు జట్ల ఆటగాళ్ల ప్రతిభకు క్రీడా లోకం ఫిదా అయింది. ఈ మ్యాచ్ సందర్భంగా భారత ప్రేక్షకులకు మరింత కిక్ లభించింది. బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్, దీపికా పదుకొణేలతో పాటు నోరా ఫతేహి ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్లో తళుక్కున మెరిశారు. తమ ‘పఠాన్’ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా షారూక్, దీపిక మ్యాచ్ కు హాజరై సందడి చేశారు. ఓ టీవీ చర్చాకార్యక్రమంలో షారూక్ తన అభిప్రాయాలు పంచుకోగా..  ఫైనల్ కు ముందు మైదానంలో దీపిక ప్రపంచ కప్ ట్రోఫీని విడుదల చేసింది.

 ఇంకోవైపు నోరా ఫతేహి ఫైనల్ సందర్భంగా ఏర్పాటు చేసిన ముంగిపు వేడుకల్లో అద్భుత ప్రదర్శన ఇచ్చింది. ప్రముఖ ర్యాపర్లు బాల్కీస్, రహ్మా రియాద్, మనల్‌లతో పాటు 'లైట్ ది స్కై' గీతానికి ఆమె అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. నల్ల రంగు డ్రెస్సులో స్టేజీపైకి వచ్చిన నోరా తన నృత్యంతో పాటు  గాత్రంతోనూ అలరించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంత పెద్ద టోర్నమెంట్ ముగింపు వేడుకల్లో ప్రదర్శన ఇచ్చే అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న నోరా అందరినీ అలరించింది. ముగింపు వేడుకల్లో ఆమె ప్రదర్శనే హైలైట్ గా నిలిచిందని ప్రశంసల వర్షం కురుస్తోంది. 
Nora Fatehi
Bollywood
fifa
worldcup
fina
qatar
Shahrukh Khan
Deepika Padukone

More Telugu News