samsung: పదివేలలోపు ధరలో శాంసంగ్ స్మార్ట్ ఫోన్

Own the all new Samsung Galaxy M04 with superfast 8GB RAM at INR 8499 only
  • రూ.8.5 వేలకు 8 జీబీ ర్యామ్ తో మార్కెట్లోకి..
  • అదిరిపోయే స్పీడ్, 128 జీబీ మెగా స్టోరేజ్
  • 5 వేల ఎంఏహెచ్ తో పవర్ ఫుల్ బ్యాటరీ
కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్న వారికి శాంసంగ్ శుభవార్త చెప్పింది. తక్కువ ధరకే అత్యాధునిక ఫీచర్లతో కొత్త ఫోన్ ను కంపెనీ లాంచ్ చేసింది. బడ్జెట్ ఫోన్ కేటగిరిలో శాంసంగ్ మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. పదివేల లోపు ప్రారంభ ధరతో సూపర్ ఫాస్ట్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ మెగా స్టోరేజ్ సామర్థ్యంతో శాంసంగ్ తీసుకొచ్చిన ఈ కొత్త స్మార్ట్ ఫోన్ విశేషాలు.. ఈ స్మార్ట్ ఫోన్ కు రెండేళ్ల పాటు సాఫ్ట్ వేర్ అప్ డేట్లను ఉచితంగా అందించనున్నట్లు శాంసంగ్ పేర్కొంది.

  • స్మార్ట్ ఫోన్ పేరు.. ఎం 04
  • ర్యామ్: 8 జీబీ
  • రోమ్(స్టోరేజీ): 128 జీబీ(1 టీబీ వరకు ఎక్స్ పాండ్ చేసుకునే సౌలభ్యం)
  • ప్రాసెసర్: ఎంటీకే పీ35, ఆండ్రాయిడ్ 12 ఓఎస్
  • బ్యాటరీ: 5000 ఎంఏహెచ్
  • కెమెరా: 13 ఎంపీ డ్యూయల్ కెమెరా
  • స్క్రీన్: 16.55 సెం.మీ.
  • ధర: రూ.8,500 (ప్రారంభ ధర)
  • సేల్: ఇప్పటికే మొదలైంది.. ఈ నెల 16 నుంచి మార్కెట్లో అమ్మకం మొదలైంది.
samsung
smartphone
new phone
under 10k mobile
budget smartphone

More Telugu News