టాప్ ఫైవ్ లో నిలిచిన ఫస్టు కామన్ మేన్ .. ఆదిరెడ్డి!

  • నిన్న రాత్రి జరిగిన 'బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే'
  • ఎంతోమందిని దాటుకుంటూ వచ్చిన ఆదిరెడ్డి  
  • టాప్ ఫోర్త్ పొజిషన్లలో ఉండగా జరిగిన ఎలిమినేషన్  
  • తనదైన మాట తీరుతో గుర్తుండిపోయే ఆదిరెడ్డి
Bigg Boss 6  Update

బిగ్ బాస్ సీజన్ సిక్స్ లోకి ఆదిరెడ్డి కామన్ మేన్ గా అడుగుపెట్టాడు. హౌస్ లోకి వచ్చిన వారిలో అంతో ఇంతో ఆడియన్స్ కి తెలిసినవారే. ఆదిరెడ్డి గురించి మాత్రం ఎవరికీ పెద్దగా తెలియదు. అందువలన తనవైపు ఆడియన్స్ దృష్టిని తిప్పుకోవడానికి ఆయన మిగతా వాళ్లకంటే ఎక్కువగా కష్టపడవలసి వచ్చింది. గేమ్స్ కి సంబంధించి లాజిక్ గా మాట్లాడటం .. ఆవేశంతో ఉన్న ఇంటి సభ్యులను కూల్ చేయడంలో ఆదిరెడ్డి తన ప్రత్యేకత చూపించాడు. 

గేమ్ రూల్స్ కి వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తిస్తే తాను ఆవేశపడిన సందర్భాలు ఉన్నాయి. గేమ్ లో తనకి క్లారిటీ లోపిస్తే బిగ్ బాస్ దే తప్పు అని తేల్చి చెప్పిన సంఘటనలు కూడా ఉన్నాయి. 'బిగ్ బాస్ ను తప్పు బట్టే స్థాయికి వచ్చావా?' అంటూ నాగార్జున మందలింపు రోజున కూడా తన వెర్షన్ వినిపించడానికి ఆయన ట్రై చేశాడు. ఆదిరెడ్డిలో మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉంది. అలాగే ఆటలో గెలవడం కోసం అవతలివారిని శత్రువులను చేసుకున్న సందర్భాలు తక్కువ. అందువల్లనే బయటికి వచ్చినవారిలో ఎవరూ కూడా ఆయన గురించి చెడుగా చెప్పలేదు. 

తనకి డాన్స్ రాదని అంతా నవ్వుతూ ఉంటే నామోషీకి పోకుండా, ఆ డాన్స్ తోనే నవ్వులు పూయించిన వాడాయన. గ్రాండ్ ఫినాలే స్టేజ్ పైకి చేరుకోవడానికి ముందు ఓట్లు అడిగే వేదికను కూడా ఆయన బాగా ఉపయోగించుకున్నాడు. ఆడియన్స్ ఏ పొజిషన్ ఇచ్చినా ఓకే అని చెప్పాడు. అలాంటి ఆదిరెడ్డి టాప్ ఫైవ్ లో ఒకరిగా నిలిచాడు .. టాప్ 4 స్థానంలో ఉన్నప్పుడు బయటికి వచ్చేశాడు. విజేతగా తాను నిలవకపోయినా, కామన్ మేన్ గా కావలసినంత గుర్తింపు మాత్రం తెచ్చుకున్నాడు.

More Telugu News