fifa: కప్ అందుకున్నాక మనసు మార్చుకున్న మెస్సీ!

  • ఫైనల్ గెలవడం సంతోషాన్నిచ్చిందన్న మెస్సీ
  • జాతీయ జట్టు నుంచి రిటైర్ కావట్లేదని వెల్లడి
  • అర్జెంటీనా జట్టుతో ఇంకా ఆడతానంటున్న సాకర్ దిగ్గజం
NO I AM NOT GOING TO RETIRE MESSI AFTER ARGENTINA LANDS FIFA WORLD CUP

ఖతార్ లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ లో అర్జెంటీనా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పెనాల్టీ షూటౌట్ దాకా సాగిన మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠతో జరిగింది. ఈ వరల్డ్ కప్ తర్వాత జాతీయ జట్టు నుంచి రిటైర్ అవుతానని మెస్సీ గతంలోనే ప్రకటించారు. అయితే, ఫైనల్ గెలిచి కప్ అందుకున్నాక మెస్సీ సంచలన ప్రకటన చేశారు. జాతీయ ఫుట్ బాల్ జట్టు నుంచి వైదొలగట్లేదని, ప్రపంచ కప్ గెలిచిన జట్టుతో మరిన్ని మ్యాచ్ లలో ఆడాలని అనుకుంటున్నట్లు తెలిపారు. దీంతో మెస్సీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. 

ఫిఫా వరల్డ్ కప్ ను అర్జెంటీనా గెలుచుకున్న తర్వాత మెస్సీ అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ‘ఇది నమ్మశక్యం కావట్లేదు. దేవుడు నాకు కప్ ఇవ్వబోతున్నాడని నాకు కచ్చితంగా తెలుసు. ఇది మాకు చాలా సంతోషం కలిగించింది’ అని మెస్సీ అన్నారు. అలాగే తాను జాతీయ జట్టులో కొనసాగుతానని ప్రకటించారు. అయితే, అర్జెంటీనా కెప్టెన్ మరో ప్రపంచ కప్ ఆడకపోవచ్చని క్రీడాకారులు చెబుతున్నారు. అమెరికాలో కోపా లా అల్బిసెలెస్టేకు మెస్సీ ప్రాతినిథ్యం వహించే అవకాశం ఉందంటున్నారు.

More Telugu News