INS Mormugao: భారత రక్షణ రంగం మరింత బలోపేతం.. నౌకాదళంలో చేరిన శత్రు భీకర యుద్ధనౌక!

India made missile destroyer INS Mormugao commissioned
  • దేశీయంగా నిర్మితమైన ‘ఐఎన్ఎస్ మోర్ముగావో’
  • నౌకాదళంలో ప్రవేశపెట్టిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
  • అణు, జీవ రసాయన యుద్ధ పరిస్థితుల్లోనూ పోరాడేలా తీర్చిదిద్దిన వైనం
భారత రక్షణ రంగం మరింత బలోపేతమైంది. దేశీయంగా నిర్మించిన స్టెల్త్ గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌక ‘ఐఎన్ఎస్ మోర్ముగావో’ నిన్న నౌకాదళంలో అడుగుపెట్టింది. ‘విశాఖపట్టణం’ క్లాస్ డిస్ట్రాయర్‌లో రెండోదైన ఈ భారీ నౌకను ముంబైలో నిన్న జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నౌకాదళంలో ప్రవేశపెట్టారు.

నాలుగు శక్తిమంతమైన గ్యాస్ టర్బైన్లతో నడిచే ఈ నౌక గంటకు 30 నాట్ల (55 కిలోమీటర్లు)కు పైగా వేగంతో ప్రయాణిస్తుంది. నేవీకి చెందిన వార్‌షిప్ డిజైన్ బ్యూరో దీనిని డిజైన్ చేసింది. మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ దీనిని నిర్మించింది. ఇందులో ముప్పావు వంతు భాగాలు దేశీయంగా తయారైనవే. ఇందులో అధునాతన సెన్సార్లు, ఆయుధాలు ఉన్నాయి. అలాగే, నిఘా రాడార్ వ్యవస్థ కూడా ఉంది. ఉపరితలం నుంచి ఉపరితలం, ఉపరితలం నుంచి గగన లక్ష్యాలపై ఇది క్షిపణులను సంధించగలదు. అంతేకాదు అణు, జీవ రసాయన యుద్ధ పరిస్థితుల్లోనూ పోరాడగలిగేలా దీనిని తీర్చి దిద్దారు.
INS Mormugao
Indian Navy
Rajnath Singh

More Telugu News