Trivikrama Varma: మాచర్లలో ఎవరెవరు ఏమేం చేశారో ఆధారాలు ఉన్నాయి: డీఐజీ త్రివిక్రమ వర్మ

  • మాచర్లలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు
  • పలువురికి గాయాలు
  • డీఐజీ త్రివిక్రమ వర్మ ప్రెస్ మీట్
  • ఎఫ్ఐఆర్ నమోదు చేశామని వెల్లడి
DIG Press Meet over Macherla clashes

పల్నాడు జిల్లాలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణల నేపథ్యంలో గుంటూరు రేంజి డీఐజీ త్రివిక్రమ వర్మ మీడియా సమావేశం నిర్వహించారు. తమ వద్ద వీడియో ఫుటేజి ఉందని, దాని ఆధారంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎవరెవరు ఏమేం చేశారో ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. 

మాచర్లలో సాయంత్రం 6.30 గంటల నుంచి 7.30 గంటల మధ్య ఘర్షణలు జరిగాయని డీఐజీ వివరించారు. ఇరు పార్టీల నేతలు పరస్పరం కవ్వింపులకు పాల్పడ్డారని వెల్లడించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిని కఠినంగా శిక్షిస్తామని అన్నారు. గాయపడిన వారి నుంచి కూడా ఫిర్యాదులు తీసుకున్నామని తెలిపారు. మాచర్లలో జరిగిన ప్రతి ఘటనపైనా ఆయా సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని చెప్పారు. 

మాచర్లలో టీడీపీ కార్యక్రమానికి పరిసర గ్రామాల నుంచి జనసమీకరణ జరిగిందని, చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎంతమంది వచ్చారో ఆరా తీస్తున్నామని డీఐజీ త్రివిక్రమ వర్మ వెల్లడించారు. టీడీపీ నేతలు తమ ర్యాలీ సున్నితమైన ప్రాంతాల గుండా వెళుతుందని పోలీసులకు చెప్పలేదని తెలిపారు. మాచర్ల ఘటనలపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, బాధ్యులందరిపైనా చర్యలు ఉంటాయని అన్నారు.

More Telugu News