Raviteja: ఇకపై శ్రీలీల డేట్స్ దొరకడం కష్టమేనేమో: రవితేజ

Dhamaka movie pre release event
  • రవితేజ హీరోగా చేసిన 'ధమాకా'
  • శ్రీలీలకి గ్లామర్ తో పాటు టాలెంట్ ఉందంటూ వ్యాఖ్య 
  • ఇకపై ఆమె డేట్స్ దొరక్కపోవచ్చని వెల్లడి
  • మళ్లీ ఇదే బ్యానర్లో చేయాలనుందని నిర్మాతలపై ప్రశంసలు

రవితేజ హీరోగా రూపొందిన 'ధమాకా' సినిమా, ఈ నెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ స్టేజ్ పై రవితేజ మాట్లాడుతూ .. "ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకంతోనే అంతా ఉన్నారు. అందుకే సక్సెస్ మీట్ లో మాట్లాడుకుందామని చెప్పేస్తున్నారు" అన్నారు. 

"ఈ సినిమాలో సాంగ్స్ .. కొరియోగ్రఫీ హైలైట్ అవుతాయి .. సినిమా చూసిన తరువాత ఆ విషయం మీకే అర్థమవుతుంది. రామ్ - లక్ష్మణ్ ఫైట్స్ ను ఇరగదీసేశారు. శ్రీలీల విషయానికే వస్తే, రెండో సినిమాకే తను జనంలోకి భయంకరంగా వెళ్లిపోయింది. అందంతో పాటు టాలెంట్ .. ఎనర్జీ ఉన్న హీరోయిన్ ఆమె. తను నెక్స్ట్ ఇయర్ కి నెక్స్ట్ లెవెల్ కి వెళుతుంది .. నా మాటలు గుర్తుపెట్టుకోండి. మళ్లీ మనకే డేట్స్ ఇస్తుందో లేదో, ముందుగానే తీసేసుకోండి' అని చెప్పారు.

భీమ్స్ పాటలను అదరగొట్టేశాడు .. ప్రతి పాటను నన్ను దృష్టిలో పెట్టుకుని చేసినట్టుగానే నాకు అనిపించింది. ఈ సినిమాతో తను కూడా నెక్స్ట్ లెవెల్ కి వెళతాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అని ఏ ముహూర్తాన పెట్టారోగానీ, ఒక ఫ్యాక్టరీ మాదిరిగా ఈ బ్యానర్ నుంచి వరుస సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఈ బ్యానర్ లో మళ్లీ మళ్లీ చేయాలనుంది" అంటూ చెప్పుకొచ్చారు.
Raviteja
Sreeleela
Trinatha Rao
Dhamaka Movie

More Telugu News