Argentina: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్... అర్జెంటీనాను ఆధిక్యంలో నిలిపిన మెస్సీ, డి మారియా

Argentina strikes two times in FIFA World Cup final against France
  • ఖతార్ లో ఫిఫా వరల్డ్ కప్
  • దోహాలో ఫైనల్ మ్యాచ్
  • అర్జెంటీనా వర్సెస్ ఫ్రాన్స్
  • రెండు గోల్స్ తో అర్జెంటీనా ముందంజ
ఖతార్ లోని దోహా నగరంలో అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్ల మధ్య ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి 36 నిమిషాల్లోనే అర్జెంటీనా రెండు గోల్స్ సాధించి ముందంజ వేసింది. మ్యాచ్ 27వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్ ను లయొనెల్ మెస్సీ గోల్ గా మలచడంతో అర్జెంటీనా 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఫ్రెంచ్ గోల్ పోస్ట్ ముందు అర్జెంటీనా ఆటగాడు డి మారియాను ఫ్రాన్స్ ఆటగాడు డెంబెలే టాకిల్ చేయడంతో రిఫరీ ఈ పెనాల్టీ కిక్ ను కేటాయించాడు. మెస్సీ ఎలాంటి పొరబాటు చేయకుండా బంతిని గోల్ పోస్టులోకి పంపడంతో స్టేడియంలో అర్జెంటీనా అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. 

ఆ తర్వాత డి మారియా 36వ నిమిషంలో కొట్టిన ఫీల్డ్ గోల్ తో అర్జెంటీనా ఆధిక్యం 2-0కి పెరిగింది. అర్జెంటీనా ఆధిక్యాన్ని తగ్గించేందుకు ఫ్రెంచ్ ఆటగాళ్లు సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నప్పటికీ ఫలితం దక్కలేదు.
Argentina
France
Final
FIFA World Cup
Doha
Qatar

More Telugu News