pathaan: బాలీవుడ్ బాద్ షాకు కొత్త చిక్కులు.. ‘బాయ్ కాట్ పఠాన్’ కు ముస్లిం బోర్డు మద్దతు

  • పఠాన్ సినిమాపై ముస్లిం బోర్డు అసహనం
  • ఇస్లాంను అగౌరవ పరుస్తుందని బోర్డు చీఫ్ ఆరోపణ
  • మూవీని థియేటర్లలో రిలీజ్ చేయొద్దని డిమాండ్
  • షారుఖ్ ఖాన్ కు వీసా ఇవ్వొద్దంటూ హజ్ కమిటీకి విజ్ఞప్తి! 
Now Muslim board slams SRKs next for hurting religious sentiments

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. తన కొత్త సినిమా పఠాన్ ను ఇప్పటికే పలు వివాదాలు చుట్టుముట్టాయి. సినిమా బాయ్ కాట్ చేయాలని పలు సంస్థలు పిలుపునిచ్చాయి. తాజాగా ఓ ముస్లిం బోర్డు కూడా ఈ బాయ్ కాట్ పిలుపుకు మద్ధతు తెలిపింది. పఠాన్ సినిమాలో అశ్లీలతపై అసహనం వ్యక్తంచేసింది. ఇస్లాంను కించపరిచేలా ఉందని ఆరోపించింది. ముస్లిం కమ్యూనిటీలో పఠాన్లు అత్యంత గౌరవనీయులని, వారిని అగౌరవపరిచేలా సినిమా ఉందని మండిపడింది.

పఠాన్ సినిమా బాయ్ కాట్ చేయాలన్న ఆందోళనలకు మధ్యప్రదేశ్ కు చెందిన ఉలేమా బోర్డ్ మద్దతు తెలిపింది. ఇప్పటికే రిలీజ్ చేసిన బేషరమ్ రంగ్ పాటలో అశ్లీలత శృతిమించిందంటూ తమకు ఫోన్లు వస్తున్నాయని బోర్డు చీఫ్ సయ్యద్ అనాస్ అలీ చెప్పారు. సినిమాపై చాలామంది ఫోన్లు చేసి కంప్లైంట్ చేస్తున్నారని ఆయన తెలిపారు. పఠాన్ సినిమాను థియేటర్లలో విడుదల చేయొద్దని అనాస్ అలీ డిమాండ్ చేశారు. ఒకవేళ విడుదల చేస్తే సినిమాను చూడొద్దంటూ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. 

ముస్లిం మతాన్ని తప్పుగా చూపిస్తే అభ్యంతరం తెలిపే హక్కు తమకు ఉందని అనాస్ అలీ అన్నారు. అంతేకాదు, మత విశ్వాసాలను అగౌరవ పరిచేలా సినిమాలో చూపెట్టినందుకు షారుఖ్ ఖాన్ కు వీసా ఇవ్వొద్దంటూ హజ్ కమిటీకి అనాస్ అలీ విజ్ఞప్తి చేశారు. కాగా, జనవరి 25 న విడుదల కానున్న పఠాన్ సినిమాపై, ఇప్పటికే విడుదల చేసిన ఆ సినిమా పాటపై వివాదం రేగిన సంగతి తెలిసిందే!

More Telugu News