Shardul Thakur: ఫిబ్రవరిలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్

Shardul Thakur and Mittali Parulkar to get married in February
  • చిన్ననాటి స్నేహితులు మిథాలీ పారుల్కర్‌తో గతేడాది నిశ్చితార్థం
  • ఫిబ్రవరి 27న ముహూర్తం ఫిక్స్
  • ముంబైలో మహారాష్ట్ర సంప్రదాయంలో వివాహం
టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ వచ్చే ఏడాది పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఫిబ్రవరి 27న తన చిన్ననాటి స్నేహితురాలైన మిథాలీ పారుల్కర్‌ మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరిద్దరికీ గతేడాది నవంబరులో నిశ్చితార్థం జరిగింది. తాజాగా పెళ్లి డేట్‌ ఫిక్స్ అయింది.

ఫిబ్రవరి 24 వరకు షెడ్యూళ్లతో శార్దూల్ బిజీగా ఉండడంతో 27న ముహూర్తం నిర్ణయించారు. 25 నుంచే వివాహ వేడుకలు ప్రారంభమవుతాయని మిథాలీ తెలిపారు. ముంబై శివారులోని కర్జత్‌లో మహారాష్ట్ర సంప్రదాయంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో వివాహం జరగనుంది. ఎంటర్‌ప్రెన్యూర్, మోడల్ అయిన మిథాలీ ప్రస్తుతం బేకింగ్ స్టార్టప్ నిర్వహిస్తున్నారు.

ఐపీఎల్‌లో శార్దూల్ ఠాకూర్ ఈసారి కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. గతేడాది వేలంలో ఢిల్లీ కేపిటల్స్ అతడిని రూ. 10.75 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, ఆ సీజన్‌లో అతడు పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో ట్రేడింగ్ విండో ద్వారా శార్దూల్‌ను కోల్‌కతాకు అమ్మేసింది.
Shardul Thakur
Team India
Mittali Parulkar

More Telugu News