రోహిత్ రెడ్డి సవాల్ ను నేను పట్టించుకోను: బండి సంజయ్

  • రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు
  • బెంగళూరు డ్రగ్స్ కేసు రీఓపెన్ చేయాలన్న బండి సంజయ్
  • రోహిత్ రెడ్డికి కర్ణాటక ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందని వెల్లడి
  • ఆధారాలు చూపించాలని సవాల్ విసిరిన రోహిత్ రెడ్డి
Bandi Sanjay said he does not take Rhit Reddy challenge

బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మధ్య ఆరోపణలు, సవాళ్లు చోటుచేసుకుంటున్నాయి. బెంగళూరు డ్రగ్స్ కేసులో తనకు నోటీసులు వచ్చాయంటున్న బండి సంజయ్ అందుకు ఆధారాలు చూపించాలని, తాను చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిపై ప్రమాణం చేశానని, బండి సంజయ్ కూడా ఆదివారం ఇక్కడికి వచ్చి అమ్మవారి ముందు ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. 

దీనిపై బండి సంజయ్ స్పందించారు. రోహిత్ రెడ్డి సవాల్ ను తాను పట్టించుకోనని స్పష్టం చేశారు. ఎవరు పడితే వారు సవాల్ విసిరితే తాను స్పందించనని అన్నారు. 

ఈడీ రోహిత్ రెడ్డికి నోటీసులు జారీ చేయడం తెలిసిందే. అంతకుముందు, బండి సంజయ్ స్పందిస్తూ బెంగళూరు డ్రగ్స్ కేసును రీఓపెన్ చేస్తే రోహిత్ రెడ్డి పాత్ర బయటపడుతుందని అన్నారు. ఈ కేసులో రోహిత్ రెడ్డికి కర్ణాటక ప్రభుత్వం నుంచి నోటీసు కూడా వచ్చిందని తెలిపారు. దీనిపైనే రోహిత్ రెడ్డి... బండి సంజయ్ కు సవాల్ విసిరారు.

More Telugu News