Payyavula Keshav: మాచర్లలో ఉన్నది జైలు పక్షి కాదు: పయ్యావుల కేశవ్

Payyavula Keshav fires on Pinnelli
  • పిన్నెల్లి ఎమ్మెల్యే అయిన తర్వాత మాచర్ల అవినీతికి అడ్డాగా మారిందన్న కేశవ్
  • పోలీసులను అడ్డు పెట్టుకుని ఆస్తులను ధ్వంసం చేయడం దారుణమని వ్యాఖ్య
  • జనాల ఛీత్కారాలను జీర్ణించుకోలేకే వైసీపీ రౌడీ మూకల్ని రెచ్చగొట్టారని మండిపాటు
వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత మాచర్ల అవినీతికి అడ్డాగా మారిందని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జీ జూలకంటి బ్రహ్మారెడ్డి నివాసానికి నిప్పు పెట్టిన ఘటనపై ఆయన స్పందిస్తూ... పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ కార్యకర్తలపై దాడి చేయడం, వారి ఆస్తులను ధ్వంసం చేయడం దారుణమని అన్నారు. 

ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా జూలకంటికి జనాలు బ్రహ్మరథం పడుతున్నారని... దీన్ని ఓర్చుకోలేక సిగ్గుమాలిన చర్యలకు పిన్నెల్లి పాల్పడుతున్నారని మండిపడ్డారు. పిన్నెల్లిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని... జనాల ఛీత్కారాలను జీర్ణించుకోలేక వైసీపీ రౌడీ మూకల్ని రెచ్చగొట్టారని, మాచర్లను మంటల్లోకి నెట్టారని విమర్శించారు. పిన్నెల్లి రంకెలేస్తే భయపడటానికి మాచర్లలో ఉన్నది జైలుపక్షి కాదని... అక్కడున్నది జూలకంటి బ్రహ్మారెడ్డి అని చెప్పారు. జగన్ బినామీ పిన్నెల్లి అని ఆరోపించారు.
Payyavula Keshav
Telugudesam
Pinnelli Ramakrishna Reddy
YSRCP

More Telugu News