papikondalu: పాపికొండలు చూసొద్దామా.. పర్యాటకుల కోసం ఏపీ టూరిజం స్పెషల్ ప్యాకేజీలు

  • రాజమహేంద్రవరం, పోచవరం, గండి పోచమ్మ నుంచి మొదలయ్యేలా షెడ్యూల్
  • ఒకరోజు, రెండు రోజుల ప్రత్యేక ప్యాకేజీలు
  • కుటుంబంతో కలిసి పాపికొండల్లో విహరించేలా ఏర్పాట్లు
AP Tourism Department has announced special packages for Papikondalu tour

పాపికొండల్లో బోటు షికారు చేయాలనుకునే వారికోసం ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ స్పెషల్ ప్యాకేజీలు ప్రకటించింది. ఒకటి, రెండు రోజుల వ్యవధితో రెండు రకాల ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది. సెలవు రోజుల్లో కుటుంబంతో కలిసి విహరించేలా ప్లాన్ చేసింది. రాజమహేంద్రవరం, పోచవరం, గండి పోచమ్మ ప్రాంతాల నుంచి మొదలయ్యేలా టూర్లను షెడ్యూల్ చేసింది. ఈ ప్యాకేజీల వివరాలను కాకినాడ డివిజనల్ మేనేజర్ సీహెచ్ శ్రీనివాస్ వెల్లడించారు. 

రాజమహేంద్రవరం నుంచి..

  • ఒక రోజు పర్యటనకు ఉదయం 7.30 నుంచి సాయంత్రం 7.30 వరకు యాత్ర కొనసాగుతుంది. 
  • పెద్దలకు రూ.1,250, చిన్నారులకు రూ.1,050 చార్జీగా నిర్ణయించారు. టిఫిన్, లంచ్(వెజ్), స్నాక్స్ ఇస్తారు. 
  • రెండు రోజుల పర్యటనలో ఉదయం 7.30 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు సాయంత్రం 7.30 గంటలకు తిరిగి వస్తారు. 
  • పెద్దలకు రూ.3,000, పిల్లలకు రూ.2,500 చార్జీ.
  • వివరాలకు 98486 29341, 98488 83091 నెంబర్లలో సంప్రదించాలని డీఎం శ్రీనివాస్ చెప్పారు.
పోచవరం నుంచి..
  • పాపికొండలకు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 వరకు ఒకరోజు, రెండు రోజుల పర్యటనలు ఉన్నాయి. 
  • ఒక రోజు పర్యటనకు ఉదయం 9.30 గంటలకు బయలుదేరి సాయంత్రం 5 గంటలకు తిరిగొస్తారు. 
  • పెద్దలకు రూ.1,000, పిల్లలకు రూ.800 చార్జీ.
  • రెండు రోజుల పర్యటనలో ఉదయం 7.30 గంటలకు బయలుదేరితే మరుసటి రోజు సాయంత్రం 7.30 గంటలకు తిరిగొస్తారు.
  • పెద్దలకు రూ.2,500, పిల్లలకు రూ.2,000 చార్జీ.
  • వివరాలకు 63037 69675 నెంబర్ లో సంప్రదించాలని డీఎం సూచించారు.

More Telugu News