Moto G53: రూ.10 వేలకే మోటరోలా 5జీ ఫోన్

  • చైనాలో విడుదలైన మోటో జీ53 5జీ
  • స్థానికంగా 900 యువాన్ల ధర
  • వచ్చే ఏడాది ఆరంభంలో భారత మార్కెట్లోకి
Moto G53 Motorola cheapest 5G phone for roughly Rs 10000 officially launched

మోటరోలా కంపెనీ చైనాలో అతి చౌకగా ఒక 5జీ ఫోన్ ను విడుదల చేసింది. దీని పేరు మోటో జీ53 5జీ. వచ్చే ఏడాది ఆరంభంలో భారత మార్కెట్లోకి ఇది విడుదల కావచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

ఇందులో 6.5 అంగుళాల ఎల్ సీడీ డిస్ ప్లే ఉంటుంది. జీ52 4జీ మోడల్ లో అయితే పీఓఎల్ఈడీ డిస్ ప్లే ఉంటుంది. మొబైల్ ధర తగ్గించాలన్న ఉద్దేశ్యంతో ఎల్ సీడీ డిస్ ప్లేను పెట్టినట్టు తెలుస్తోంది. 900 యువాన్లుగా చైనాలో ధరను నిర్ణయించింది. మన రూపాయిల్లో రూ.10,700. 

120 హెర్జ్ రీఫ్రెష్ రేటు, హెచ్ డీ ప్లస్ రిజల్యూషన్, క్వాల్ కామ్ ప్రాసెసర్, , 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ కెమెరా సెటప్, ఇందులో 50 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ చార్జింగ్ ఉన్నాయి.

More Telugu News