Chandrababu: మాచర్ల పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి చంద్రబాబు ఫోన్

  • గుంటూరు జిల్లా మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత 
  • టీడీపీ నేత జూలకంటి ఇంటికి నిప్పు పెట్టిన దుండగులు
  • పోలీసులు ఎందుకు స్పందించలేదంటూ డీజీపీకి చంద్రబాబు ఫోన్ 
Chandrababu telephones DGP on Macherla issue

గుంటూరు జిల్లా మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు టీడీపీ నేతలు మాచర్లకు వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రులు, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జీల నివాసాల వద్ద పోలీసులు కాపలా కాస్తున్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ మాచర్లలోనే ఉన్నారు. 

కాగా, ఈ ఘటనను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలకు ఈ ఘటన నిదర్శనమని అన్నారు. ఈ చర్యకు పాల్పడిన వైసీపీ నేతలు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. అలాగే, డీజీపీకి చంద్రబాబు ఫోన్ చేశారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే పోలీసులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బాధ్యులపై, గూండాలకు సహకరించిన పోలీసు అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

More Telugu News