F-35B Lightning fighter jet: విమానాన్ని హెలికాప్టర్‌లా ల్యాండ్ చేసే ప్రయత్నం.. కుప్పకూలి గింగిరాలు తిరిగిన ఫైటర్ జెట్.. వీడియో ఇదిగో!

F35B Lightning fighter jet crash landing at texas air station
  • టెక్సాస్‌లోని ఎయిర్ స్టేషన్‌లో ఘటన
  • విమానం చక్రాలు రన్‌వేను తాకడానికి ముందే నేలను ఢీకొట్టిన ముందుభాగం
  • పారాచూట్ సాయంతో బయటపడిన పైలట్
చూస్తుండగానే ఓ ఫైటర్ జెట్ కుప్పకూలిపోయింది. అయితే, పైలట్ మాత్రం తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిందీ ఘటన. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ప్రకారం.. టెక్సాస్ ఎయిర్‌స్టేషన్‌లో రన్‌వేపై దిగేందుకు ఎఫ్ 35బీ విమానం సిద్ధమవుతోంది. నెమ్మదిగా ల్యాండ్ అవుతున్నట్టు కనిపిస్తున్న విమానాన్ని హెలికాప్టర్‌లా ల్యాండ్ చేసేందుకు పైలట్ ప్రయత్నించినట్టు వీడియోను బట్టి అర్థమవుతోంది. 

ఈ క్రమంలో విమానం చక్రాలు నేలను తాకడానికి ముందే అదుపుతప్పి ముందుభాగం నేలను ఢీకొని గింగిరాలు తిరిగింది. ప్రమాదాన్ని శంకించిన పైలట్ పారాచూట్ సాయంతో చాకచక్యంగా బయటపడ్డాడు. వెంటనే అక్కడకు చేరుకున్న అత్యవసర సిబ్బంది విమానం పేలిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. విమానం కూలిన ఘటనపై దర్యాప్తుకు ఆదేశించినట్టు అమెరికన్ ఎయిర్‌ఫోర్స్ అధికారులు తెలిపారు.
F-35B Lightning fighter jet
Texas
USA
Crash Landing

More Telugu News