Koppula Eshwar: జేపీ నడ్డా, బండి సంజయ్ లకు సిగ్గుందా?: కొప్పుల ఈశ్వర్

BRS very much needed for our country says Koppula Eshwar
  • బీజేపీ చెప్పేవన్నీ అబద్ధాలేనన్న ఈశ్వర్
  • నిజాలు చెప్పేందుకే బీఆర్ఎస్ పుట్టిందని వ్యాఖ్య
  • బీఆర్ఎస్ ను చూసి బీజేపీకి చెమటలు పడుతున్నాయని ఎద్దేవా

దేశంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని బీఆర్ఎస్ నేత, తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. దేశ ప్రజలకు ప్రత్యామ్నాయ పార్టీ లేకపోవడం వల్లే బీజేపీకి ఓటు వేస్తూ వచ్చారని చెప్పారు. పాకిస్థాన్, చైనా బోర్డర్ల పేర్లు చెప్పుకుంటూ బీజేపీ బతికేస్తోందని విమర్శించారు. బీజేపీ అన్నీ అబద్ధాలే చెపుతుందని, ఆ పార్టీ చెప్పే దానిలో ఒక్క నిజం కూడా ఉండదని దుయ్యబట్టారు.

ఇక నిజాలు చెప్పేందుకే బీఆర్ఎస్ పుట్టిందని మంత్రి అన్నారు. బీఆర్ఎస్ ఆషామాషీగా పుట్టిన పార్టీ కాదని, ఆ పార్టీ అవసరం దేశానికి ఉందని చెప్పారు. బీఆర్ఎస్ ను చూసి బీజేపీకి చెమటలు పడుతున్నాయని అన్నారు. కరీంనగ్ సభలో అన్నీ అబద్ధాలు చెప్పిన జేపీ నడ్డా, బండి సంజయ్ కు అసలు సిగ్గుందా? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీకి కౌంట్ డౌన్ ప్రారంభమయిందని అన్నారు.

  • Loading...

More Telugu News