Anand Mahindra: సీల్ చేప చేసింది చూస్తే.. తెల్లబోవాల్సిందే..!

Anand Mahindra shares video of seal taking a dip in the pool What followed next will make you go ROFL
షార్ట్స్‌లో చూడండి
సీల్ చేప మనుషులకు సన్నిహితంగా వ్యవహరిస్తుండడం చాలా సందర్భాల్లో చూశాం. తాజా ఘటన దీన్ని మరోసారి బలపరిచేలా ఉంది. సముద్రం పక్కనే ఓ రిసార్ట్ ఉంది. ఆ రిసార్ట్ లో ఓ స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేశారు. సందర్శకులు స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ చేసి, పక్కనే కాసేపు సేద తీరేందుకు రిక్లైనర్ మాదిరి పడక కుర్చీలు ఏర్పాటు చేసి ఉన్నాయి. 

రెండు కుర్చీలు ఉంటే, అందులో ఒక కుర్చీలో ఓ వ్యక్తి కూర్చుని ఉన్నాడు. ఇంతలో సముద్రం నుంచి చిన్నగా రిసార్ట్ లోకి పాకుకుంటూ వచ్చిన సీల్ చేప స్విమ్మింగ్ పూల్ లోకి దిగింది. అటూ ఇటూ రెండు రౌండ్లు ఈదిన తర్వాత ఒడ్డుకు చేరి ఆ వ్యక్తి కూర్చున్న పడక కుర్చీ వైపు వచ్చేస్తుండడంతో.. సదరు వ్యక్తి లేచి దానికి దారిచ్చాడు. అది దర్జాగా ఆ కుర్చీ ఎక్కి పడుకుంది. అంటే అచ్చం వ్యక్తి చేసినట్టుగా ఇది అనుకరించింది. అది కావాలనుకుంటే ఏ బండ రాయిపైనో, లేదంటే రిసార్ట్ మెట్లపైనో పడుకోవచ్చుగా..? మనిషి మాదిరే చేయడం ఎందుకు? అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను షేర్ చేశారు. ‘‘వారాంతపు ప్రణాళికలను గుర్తించిన ఓ జెంటిల్ మెన్ ఇదని నేను నమ్ముతున్నాను’’ అంటూ ఆయన క్యాప్షన్ పెట్టారు. ఇప్పుడు జంతువులు సైతం మావన సంస్కృతిని అలవరుచుకుంటున్నాయంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు. ‘‘మీరు మా పరిధిలోకి చొరబడితే.. మేము మీ ప్రదేశంలోకి చొరబడతాము అన్నది ఇందులోని మోటో’’ అంటూ మరో యూజర్ స్పందించాడు.
Go Back to Shorts
Anand Mahindra
shares
video
seal
swimming pool

More Telugu News